అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఈనెల 6వ తేదీ నుండి 8వ తేది వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఎపి సచివాలయం మూడవ భవనం అప్సా(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం) హాల్లో ఏర్పాటు చేసిన ఈశిబిరాన్ని ఆయన ప్రారంభించి ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు.మూడు రోజుల పాటు నిర్వహించే ఈశిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సూచించారు.
ఈ ప్రత్యేక క్యాంపులో ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్ సబ్ మిషన్,కొత్త ఓటర్లు ఎన్రోల్మెంట్,ఓటర్ల జాబితా నుండి చనిపోయిన వారి పేర్లు తొలగింపు,చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు.ఉద్యోగులు 2002 నాటి ఓటరు వివరాలు,తాజా ఫోటో,ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)ఆధార్ కార్డు,రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ వివరాలతో వచ్చి వారి ఓటరు వివరాలు నమోదు చేసుకుంటున్నారు.అనంతరం ఈప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ఓటరు వివరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సిఇఓ వివేక్ యాదవ్ ఓటరు గుర్తింపు ప్రొసీడింగ్స్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలక్టర్ సాయి కాంత్ వర్మ,గుంటూరు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జాయింట్ సిఇఓ ఇ.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షలు రామకృష్ణ, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News