-జూలై 9న విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం – మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం జెడ్‌ఈడీ (ZED), జీఈఎం (GEM), లీన్ (LEAN) పథకాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని 2026 జూలై 9వ తేదీ (గురువారం) విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలైన జెడ్‌ఈడీ (Zero Defect Zero Effect), జీఈఎం (Greening Entrepreneurship & the Ecosystem), లీన్ (Lean Manufacturing) పథకాల ద్వారా నాణ్యమైన తయారీ, పర్యావరణహిత పారిశ్రామిక విధానాలు, అలాగే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSMEs) ఉత్పాదకత పెంపుపై మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఏపీ ఛాంబర్స్ తెలిపింది. నమోదు మరియు మరిన్ని వివరాలకు నాగలక్ష్మి, మొబైల్ : 80741 49141 సంప్రదించాలని అధ్యక్షులు, పొట్లూరి భాస్కరరావు ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News