విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల సాధికారతకు జాతీయ పురస్కారాలు – 2026 కు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ల ఆహ్వానం.
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన్) ఆధ్వర్యములో, దివ్యాంగుల సాధికారత రంగములో విశిష్ట సేవలు అంధించిన వ్యక్తులు మరియు సంస్థలకు జాతీయ అవార్డులు–2026 కొరకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు తెలియజేసినారు.
దివ్యాంగుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చే కార్యక్రమములు, వినూత్న ఆవిష్కరణలు, సేవలు మరియు విశిష్ట విజయాలను గుర్తించి ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఈ జాతీయ అవార్డులను అందజేస్తుంది. దివ్యాంగుల సాధికారత రంగములో భారత ప్రభుత్వం అందించే అత్యున్నత గుర్తింపుగా నిలిచే ఈ అవార్డుల కొరకు ఈ క్రింది విభాగాల్లో నామినేషన్లు ఆహ్వానించబడుతున్నాయి.
• వ్యక్తిగత ప్రతిభ (Individual Excellence) – 2026
• దివ్యాంగుల సాధికారత కోసం విశేషంగా సేవలందిస్తున్న సంస్థలు – 2026.
కావున, అర్హులైన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు మరియు దివ్యాంగుల సాధికారత కోసం సేవలందిస్తున్న సంస్థలు సదరు అవార్డులు పొందుటకు అవసరమగు అర్హతలు, మార్గదర్శకాలు మరియు దరఖాస్తు ఇతర పూర్తి వివరముల కొరకు ‘రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్’ (www.awards.gov.in) వెబ్‌సైట్ నందు సంప్రదించవచ్చునని మరియు నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ: 31 జూలై, 2026 కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసినదిగా డాక్టర్ రమేష్ కొల్లేటి, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు స్టెప్, క్రిషి, విజయవాడ వారు ఒక ప్రకటనలో తెలియచేశారు.
Tags vijayawada
Check Also
ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …
Prajavartha Online Telugu News