Breaking News

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఈ ఏడాది స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలపై చర్చించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ను స్థాపించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కమిషనర్ ఎల్.చంద్రకళ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఎంహెచ్వో డా. ఇందుమతి, జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ డాక్టర్ పి.మురళి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *