అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి వద్ద వైఎస్ జగన్ ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. చినజీయర్ స్వామితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కూడా సీఎంను కలిశారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …