అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా…

-49వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ: తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన 49వ డివిజన్ ప్రజలందరికీ బీజేపీ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బుధవారం ఆయన డివిజన్ పరిధిలో కృతజ్ఞతా పూర్వక పర్యటన నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు వీధుల్లో పర్యటించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ తన విజయానికి అహర్నిశలు శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచి విజయం అందించిన ప్రతి ఒక్క ఓటరుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 49వ డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.