Breaking News

ప్రజారోగ్యం సిబ్బందికి ప్రత్యేక సామర్థ్య వృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు సురక్షితమైన పనివాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో, నాలెడ్జ్ పార్ట్నర్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) సహకారంతో ప్రత్యేక సామర్థ్య వృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గల హోటల్ పార్క్ ఎన్ లో శానిటేరీ సెక్రెటరీస్ కి, ఆశా ఫంక్షన్ హాల్, పటమట, మరియు కృష్ణ డిస్ట్రిక్ట్ రైస్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్, గాంధీనగర్ లో పారిశుధ్య కార్మికులకు శిక్షణ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (ఇంచార్జ్) డాక్టర్ ఎన్. గోపాల నాయక్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. అన్నపూర్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎన్. గోపాల నాయక్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతను పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో వారు ముందుండి పనిచేస్తున్నారని కొనియాడారు. విధుల నిర్వహణలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) తప్పనిసరిగా వినియోగించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. వర్షాకాలంలో దోమల ద్వారా, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక పారిశుద్ధ్య విధానాలపై అవగాహన కల్పించడం, సురక్షితమైన పనివాతావరణాన్ని కల్పించడం ద్వారా నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

AIILSG రిసోర్స్ పర్సన్లు ఎన్. వెంకటేశ్వర్లు, గోపి, ఏకాంత్ నాయక్ ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల వర్గీకరణ, వ్యక్తిగత పరిశుభ్రత, భద్రతా చర్యలు, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ పథకాలపై సమగ్ర శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమంలో AIILSG బృంద సభ్యులు, విజయవాడ నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *