Breaking News

మోడీ మెప్ప్పుకోసం బాబు ఆరాటం

-ప్రజా ధనం వృధా చేయడం తగదు
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్రమోడీ మెప్ప్పుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఆరాటపడుతున్నారని, అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం ప్రారంభ సందర్భంగా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు.
ఈ మేరకు గుజ్జుల ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రూ.4,727 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతూ కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నది. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది. సుమారు 70 మంది కార్మికులు వారం రోజుల పాటు శ్రమించి, దాదాపు 30,000 మొక్కలతో “వెల్‌కం… పిఎం మోదీ జీ, సిఎం సిబిఎన్ జీ” అని సందేశం సృష్టించారు. ఈ కార్యక్రమానికి ఒక్కో జిల్లా నుండి 180 బస్సులు ఏర్పాటు చేయడం, 2 లక్షల మందితో జనసమీకరణ, ప్రధాన వేదికతోసహా వివిధ గ్యాలరీలు, 7 వేల మంది పోలీసులతో పహారా ఏర్పాటుచేశారు. తొలుత సాధారణంగానే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం జరపాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత హుటాహుటిన చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. అందుకోసం కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నది. ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయల అప్ప్పుల్లో ఉన్న ఎపీని ఆర్భాటపు వృధా ఖర్చుతో మరింత అప్ప్పుల్లోకి నెట్టేలా కూటమి ప్రభుత్వ పాలన సాగడం విచారకరం. కూటమి ప్రభుత్వ వైఖరిని, వృధా ఖర్చును సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది.
అమెరికా`ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపి దేశ ప్రజలు బంగారం కొనవద్దని, ఇంధనం, వంటనూనెల వినియోగాన్ని తగ్గించాలని, వ్యక్తిగత వాహనాలకు బదులు సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను వాడాలని మోడీ ‘పొదుపు’ సందేశం ఇచ్చారు. యుద్ధాన్ని అతిపెద్ద బూచిగా చూపించి పెట్రోల్, డీజిల్, వాణిజ్య గ్యాస్, సిఎన్‌జి గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేశారు. మోడీ తాను చెప్పిన మాటలను తానే ఆచరించకుండా వెనువెంటనే విదేశీ పర్యటనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భారీ రోడ్‌షోలు, వైమానిక ప్రదర్శనలు, బిజెపి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీనినిబట్టి చెప్పేందుకే నీతులు అన్న సామెత మోడీకి ఖచ్చితంగా వర్తిస్తుందనేది అర్ధమవుతోంది. అలాగే మోడీకి తామేమీ తీసిపోమన్నట్లు కూటమి ప్రభుత్వం ఇటీవల యోగాడే పేరుతో విపరీతంగా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయడం, రాష్ట్రానికి కేంద్రం నుండి జిఎస్టీ నిధులు రూ.500 కోట్లు రాగానే, రూ.350 కోట్లు వెచ్చించి కర్నూలులో జిఎస్టీ సభ పెట్టడం వంటి ఖర్చులు వృధాకాదా? పొదుపుమంత్రం ప్రజలకేగాని, పాలకులకు వర్తించదా? అని ప్రశ్నిస్తున్నాం.
కేవలం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం కోసం లక్షలాది మంది జనసమీకరణ, కోట్ల రూపాయల ఖర్చును చూస్తే ప్రధాని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకునేందుకు సిఎం చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నట్లుగా గోచరిస్తున్నది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వ విధానాలపై విద్యార్థులు, యువత, ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ దశలో కూడా మోడీకి చంద్రబాబు దాసోహమనడం ‘తనగొయ్యి తానే తవ్వుకుంటున్నట్లు’గా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరచి, మోడీ మాయలో నుండి బయటపడకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరచే అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని తెలియజేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *