Breaking News

విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించం
-ఆర్టీసీ మనుగడకు ప్రభుత్వ బస్సులు, కార్మికులే బలం…మంత్రి రాంప్రసాద్ రెడ్డి

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. వర్క్‌షాప్‌లోని FIP, ఇంజన్, మెషిన్ షాప్, ఎలక్ట్రికల్, బాడీ షాప్, యూనిట్‌ల విభాగాలను సందర్శించి పనితీరు, బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందేలా నిర్వహణ ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్ కార్యకలాపాలను వర్క్స్ మేనేజర్ వరుణ్ కుమార్, అధికారి అరుణ, రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు మంత్రికి వివరించారు.

అనంతరం ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్మికులు, ప్రయాణికులు సంస్థకు రెండు కళ్లలాంటివారని, ప్రభుత్వ బస్సులు, కార్మికులు ఉంటేనే ఆర్టీసీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

భవిష్యత్ అవసరాలు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీలో ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులను దశలవారీగా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *