Breaking News

సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు గారికి ‘ఇండియన్ హ్యూమానిటేరియన్ అవార్డు’

-ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా ప్రగతికి గుర్తింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం సమగ్ర శిక్ష ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, సమాన విద్యా అవకాశాల కల్పన, వారి సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు ఐఏఎస్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘ఇండియన్ హ్యూమానిటేరియన్ అవార్డు’ను ప్రదానం చేసింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ శ్రీ తులసీరామ్ ఈ అవార్డును అందజేశారు.

శ్రీ బి. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం పునరావాస సేవలను బలోపేతం చేయడం, విద్యలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం, సహాయక సాంకేతికతను వినియోగించడం, సమాన విద్యా అవకాశాలను కల్పించడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ అవార్డులో ‘ప్రాజెక్ట్ దృష్టి’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన 21 మంది విద్యార్థులు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా చేరుకున్నారు. అదే విధంగా పారా స్పోర్ట్స్, ఇంక్లూజివ్ స్పోర్ట్స్ లోనూ తగిన ప్రోత్సాహం, సహకారం, సమాన అవకాశాలు కల్పిస్తే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలరనే స్ఫూర్తిని ఈ కార్యక్రమం అందించింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పిస్తూ, సమగ్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.
ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు, IAS గారు మాట్లాడుతూ ‘ఈ పురస్కారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సేవలో అంకితభావంతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష బృంద సభ్యులకు, ఆయా పిల్లల తల్లిదండ్రులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి సమగ్ర, సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *