విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (RARI) నందు 2026 సెప్టెంబర్ 30న త్రైమాసిక రాజభాషా హిందీ కార్యశాల విజయవంతంగా నిర్వహించబడినట్లు సంస్ధ పరిశోధన అధికారి, డా. యు ఆర్ శేఖర్ నంబూరి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ పరిశోధన అధికారి, డా. యు ఆర్ శేఖర్ నంబూరి గారు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో రాజభాష హిందీని అధికారిక విధుల్లో మరింత విస్తృతంగా వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే సంస్థలో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ముఖ్య అతిథికి వివరించారు.
ఈ కార్యశాలలో స్కూల్ అసిస్టెంట్ – హిందీ, జెడ్.పీ. హై స్కూల్, జక్కంపూడి, విజయవాడ నుండి కె. లక్ష్మీ నారాయణ, ముఖ్య అతిథిగా పాల్గొని రాజభాషా ప్రాముఖ్యత, “రాజభాషా హిందీ – సరళమైన భాషలో సమర్థవంతమైన అధికారిక వ్యవహారాలు” మరియు “హిందీ వినియోగంలో సాధారణ తప్పులు – సరైన పదప్రయోగం” వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యశాలలో సంస్థ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రాజభాషా హిందీ సమర్థ వినియోగంపై తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని పరిశోధన అధికారి, డా. సవిత పి. గోపోడ్ సమన్వయకర్తగా వ్యవహరించగా మరియు పరిశోధన అధికారి, డా. సుజాత పి డోకే విచ్చేసిన అతిథికి ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News