Breaking News

అవనిగడ్డ ఎస్ వి ఎల్ క్రాంతి డిగ్రీ కాలేజీ ఆవరణలో యోగ ప్రాణ శక్తి చికిత్సపై అవగాహన, శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శన… : కాలేజీ కరెస్పాండంట్ ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవనిగడ్డ ఎస్వీఎల్ కాలేజీ ఆవరణలో జరిగిన యోగ ప్రాణశక్తి చికిత్స పై అవగాహన, శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శన కార్యక్రమానికి విజయవాడ అక్యూపంక్చర్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మాకాల సత్యనారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యు హెచ్ ఓ )లక్ష్యాలకు భిన్నంగా ప్రపంచ ఆరోగ్యo క్షీణిస్తున్న ఈ సందర్భంలో, రేపటి ప్రపంచానికి భారతీయ సనాతన ఆరోగ్య విధానం యోగాలోని ప్రాణమయ కోశా తోనే సాధ్యమని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మానవుల్లో విరిగినవి, తెగినవి, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడినవి తప్ప మిగతా ఆరోగ్య సమస్యలన్నీ ప్రాణ శక్తిని పెంచటంతో తగ్గించవచ్చునని తెలిపారు. ప్రాణశక్తిని పెంచడానికి అక్యూపంక్చర్ ఆక్యు ప్రెజర్, కి,యోగ ప్రాణశక్తి మల్టీ థెరపిఎస్ ఉపయోగించడంతో పొందవచ్చు అని తెలుపుతూ, శరీరంలోని వేడి చలవ తత్వాలను సమస్థితికి తేవడం, మరియు అంతర పంచభూతాల ల పని చేసే 12 అవయవాలను సమస్థితికి తేవడంతో వారికి తెలిసిన అనారోగ్యాలు, తెలియనవి మరియు ఇకముందు రాకుండా చేయవచ్చునని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల్లో పెరిగిపోతున్న రక్తహీనత, కళ్ళు తిరిగి పడిపోవడం మరియు ఆకస్మిక మరణాలను తగ్గించడానికి ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగా టీచర్ పద్మిని యోగాసనాలను విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అలాగే అక్యూపంక్చర్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఈశ్వర్ ముఖ్యమైన శక్తి కేంద్రాల గురించి తెలిపి ఎలా ఉపయోగించుకోవాలి తెలియజేశారు. ప్రియదరర్శిని మహిళా మండలి ప్రెసిడెంట్ కానూరి విజయలక్ష్మి స్టూడెంట్ కు స్కాలర్షిప్స్ గురించి తెలిపారు.డాక్టర్ మాకాల సత్యనారాయణ బృందాన్ని కాలేజీ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *