Breaking News

ఏపీలో పెట్టుబడుల ప్రవాహానికి ముంబై రోడ్‌షో శ్రీకారం

– నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు
– మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించేందుకు, నూతన భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII) సంయుక్తంగా ముంబైలో బుధ‌వారం భారీ ‘ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ రోడ్‌షో’ నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ రోడ్‌షోలో ప్రముఖ పారిశ్రామిక సంఘాలు, వాణిజ్య సంస్థలు, విదేశీ వాణిజ్య ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కొండ‌ప‌ల్లి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ, పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు. ఈ రోడ్‌షోలో ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ (BFSI) & ఫిన్‌టెక్, జౌళి-వస్త్ర రంగం, ఫార్మాస్యూటికల్స్ & లైఫ్ సైన్సెస్, కెమికల్స్ & పెట్రోకెమికల్స్, పోర్టులు & షిప్పింగ్ లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ & ఎఫ్‌ఎమ్‌సిజి (FMCG), గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC), డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగాలలో ఉన్న విస్తృత అవకాశాలను ప్రత్యేకంగా వివరించారు. ఇక ప్ర‌భుత్వం 3S కాన్సెఫ్ట్ ( స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌, స‌ర్వీస్‌, స్టెబులిటీ ) విధానంతో ప‌ని చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు.

విశాఖ సదస్సుకు సన్నాహాలు:
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్‌షో నిర్వహించిన‌ట్టు మంత్రి తెలిపారు. ఈ రోడ్ షో నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ‘సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు’కు ఆరంభ వేదికగా నిలిచింద‌న్నారు. ఈ రోడ్‌షో ద్వారా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కంపెనీలు రాబోయే విశాఖ సదస్సులో పాల్గొని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలు మరింత విస్తృత‌మైన‌ట్టు మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టులపై దాడుల కేసుల పరిశీలనకు హైపవర్ కమిటీ

-జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *