అర్నబ్, మురసు జంట తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం

-విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన RTGS, APSDMA

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులు.. ఒకే వారంలో 20 జిల్లాలను ప్రభావితం చేసిన అర్నబ్, మురసు జంట తుపాన్లు. ఈ తీవ్ర ప్రకృతి విపత్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా నివారించింది.

ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించింది. RTGS, APSDMA సంస్థలు 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌ల ద్వారా తుపాన్ల కదలికలను పర్యవేక్షించి, ఉపగ్రహ సమాచారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.

‘మనమిత్ర’ వాట్సాప్ అప్లికేషన్, టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ప్రజల ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాయి. NDRF, SDRF, పోలీస్, ఫైర్, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో లక్షలాది మందిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు.

తుపాన్ల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులను, విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి జనజీవనాన్ని వేగంగా సాధారణ స్థితికి తీసుకొచ్చారు.

ప్రభుత్వ సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం, అధికారుల అంకితభావం కలగలిపి విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా నిలిపాయని, అర్నబ్ తుపాను ప్రభావాన్ని పరిశీలించిన కేంద్ర బృందం కూడా రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించారు.