-జాతీయ స్థాయిలో విశాఖ, విజయవాడ, గుంటూరు సహా ఐదు నగరాలకు పురస్కారాలు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ కేటగిరీల్లో మొత్తం ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. రాష్ట్రం తరఫున పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయి. పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో స్థానిక సంస్థలు సాధించిన పురోగతికి ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛత కార్యక్రమాల్లో సాధించిన ఫలితాలకు ఈ పురస్కారాలు నిదర్శనంగా నిలిచాయి.
