మేయర్ లక్ష్మీ అపర్ణ, కార్పొరేటర్లకు ఘన సన్మానం

-ప్రజలు కల్పించిన అవకాశాన్ని సేవలందించేందుకు వినియోగించుకోవాలి: లక్ష్మీ అపర్ణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్ర ఆధ్వర్యంలో బుధవారం అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో ఇటీవల ఘన విజయం సాధించిన మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు పలువురు కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ కార్పొరేటర్ నూకల నూకవరపు బాలాజీ, 68వ డివిజన్ కార్పొరేటర్ కొండల్, 69వ డివిజన్ కార్పొరేటర్ భారతి, 71వ డివిజన్ కార్పొరేటర్ కృపా సౌజన్య, దయారత్నం, 72వ డివిజన్ కార్పొరేటర్ ఆనంద్, 67వ డివిజన్ జనసేన కార్పొరేటర్ సమతలను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ కోవెలమూడి మాట్లాడుతూ.. ఇటీవల సాధించిన ఘన విజయం తమందరిపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ విజయం ప్రజలు అందించినదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారికి వీలైనంత ఎక్కువ సేవలందించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తమకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.