Breaking News

జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా నిర్వహిస్తున్నాం… : కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు వివరించారు. గొల్లపూడిలోని సిసిఎల్‌ఏ కార్యాలయం నుండి గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో దశల వారిగా జరుగుతున్న రీ సర్వే పై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ సమీక్షించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి గురువారం కలెక్టర్‌ జె.నివాస్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో భూముల రీ సర్వేలో భాగంగా 104 గ్రామల్లో డ్రోన్‌ ఫ్లైయింగ్‌ పూర్తి చేశామని వీటిలో అత్యధికంగా పామార్రు మండలంలో 26 గ్రామలు, గుడ్లవల్లెరు మండలంలో 24 గ్రామలు, పెదపారపూడి మండలంలో 18 గ్రామాలు,తిరువూరు, గంపలగూడెం మండలంలో 6 గ్రామల చొప్పున ఉన్నాయన్నారు. 220 గ్రామాల్లో ఫ్రీడ్రోన్‌ ఫ్లైయింగ్‌ కార్యకాలపాలు పూర్తి చేశామన్నారు. పదమూడవ నోటిఫీకేషన్‌లో భాగంగా 11 గ్రామాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. దశలవారిగా ఈ ప్రక్రియను చేపడుతున్నామని నిర్థేశించిన కాలానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఏడి సర్వే కె. సూర్యరావు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *