విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అర్హతగల పాస్టర్లకు నెలకు రూ. 5 వేల రూపాయల చొప్పున గౌరవవేతనం పొందేందుకు వీలుగా ధరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని యండి రియాజ్ సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు అర్హత గల పాస్టర్లకు గౌరవ వేతనం తీసుకునేందుకు సంబంధిత ధరఖాస్తులను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించడం జరిగిదన్నారు. అర్హులైన చర్చ్ పాస్టర్లు గ్రామ/ వార్డు సచివాలయాల్లో తగిన పత్రాలతో ఏప్రిల్ 8వ తేదీ లోపు అన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని యండి రియాజ్ సుల్తానా ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …