విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక బందర్ రోడ్ లోని ఠాగూర్ స్మారక గ్రంథాలయం నందు ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సభాధ్యక్షులు డాక్టర్ జి వి పూర్ణచందు, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి, ఆత్మీయ అతిథులు డాక్టర్ రావి శారద, అయ్యంకి మురళీకృష్ణ, వేమూరి బాబురావు, జే చంద్రిక, ఠాగూర్ స్మారక గ్రంథాలయ అధికారిణి కే. రమాదేవి గ్రంధాలయ ప్రాంగణంలోని అయ్యంకి వెంకట రమణయ్య రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాలకు, భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, బాలల దినోత్సవం జ్యోతి ప్రజ్వలన గావించారు. విచిత్ర వేషధారణ పోటీలలో, స్వాతి పూర్ణిమ చిత్రలేఖనం మరియు క్రాఫ్ట్స్ పోటీలలో నగరంలోని వివిధ పాఠశాలల ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు సుమారుగా 150 మంది పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచారు. చిన్నారుల ఆటలు పాటలు చిత్రాలు మాటలుతో గ్రంథాలయంలో వారోత్సవాల సంబర వాతావరణం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ జి వి పూర్ణచంద్ మాట్లాడుతూ… విద్యార్థులలో ప్రతిభాపాటవాలకు గ్రంధాలయాలు ఎంతగానో సహకరిస్తాయని చెప్పారు. ముఖ్య అతిధి డాక్టర్ రావి శారద,కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ లైబ్రరీస్ అసోసియేషన్ మాట్లాడుతూ ఈరోజు గ్రంథాలయాల అభివృద్ధికి ఆ రోజుల్లో పాతూరు నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, భారత స్వతంత్ర సమర ఉద్యమానికి మరియు భారత సమాజ అభ్యున్నతికి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. విశిష్ట అతిధి అయ్యంకి మురళీకృష్ణ, ఎంటెక్ ఐఐటీ మద్రాస్, పిహెచ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ మాట్లాడుతూ పుస్తక పఠనం వలన విద్యార్థినీ విద్యార్థులలో ఆలోచన శక్తి సృజనాత్మక పెరుగుతుందని పేర్కొన్నారు. వేమూరి బాబురావు, డైరెక్టర్ పి.బి సిద్ధార్థ కాలేజ్, విజయవాడ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ కు పుస్తక పఠనానికి ఉన్న వ్యత్యాసాన్ని విద్యార్థులకు వివరించారు. జై చంద్రిక యూపీఎస్సీ మరియు సీఏ ఫ్యాకల్టీ, మాట్లాడుతూ గ్రంథాలయాలను ఉపయోగించుకుని భవిష్యత్తులో మీరంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కోరారు.
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం…
