ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో కోలాహలంగా బాలల దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
విశాఖపట్నంలోని ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా, కోలాహలంగా నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మనవడు, హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్న వేదుల రాఘవ, ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న లలిత జ్యోతి దంపతుల తనయుడు, నాలుగో తరగతి విద్యార్థి చి. కార్తికేయ తన సహచర బృందంతో కలిసి ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.