అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది.సిఎస్ డా.శర్మ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సిఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి డిఓ లేఖ వ్రాయడం జరిగింది.సియం విజ్ణప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎపి సిఎస్ డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు మాసాల పాటు అనగా 1 జూన్,2022 నుండి 30 నవంబరు,2022 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి) శాఖ అండర్ సెక్రటరీ కులదీప్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశారు.
Tags amaravathi
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …