రాజమహేంద్రవరం అభివృద్ధికి కూటమికి ప్రజల అండ కావాలి: దేవినేని ఉమా

-కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
-చైర్మన్ అభ్యర్థి శ్రీదేవి సహా అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం అభివృద్ధికోసం కూటమికి ప్రజల అండ కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జానకిరామయ్యను ఆదరించి, తమ విలువైన ఓటుతో గెలిపించాలని ప్రజలను కోరారు. చైర్మన్ అభ్యర్థి శ్రీదేవి మరియు అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తున్న తీరును ప్రజలకు వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని కోరారు. ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలపై అవగాహన కలిగి, ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసే ప్రజాప్రతినిధుల ఎంపిక ఎంతో కీలకమని.. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక సంస్థల ద్వారా మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజమహేంద్రవరం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరు, నిబద్ధత, ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం వంటి అంశాలను పరిశీలించి తమ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.