మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుడు షేక్ రుస్తుంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
అనంతరం మేయర్ లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ.. దేశ విద్యారంగ అభ్యున్నతికి పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. విద్యావ్యాప్తి, ఉన్నత విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మేయర్ లక్ష్మీ అపర్ణను ఆత్మీయంగా సన్మానించి, ప్రత్యేక దువా ద్వారా ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలి, షేక్ మీరావలి, షేక్ మదర్ వలి, షేక్ జాఫర్, షేక్ బాజీ, షేక్ ఖాదర్, షేక్ రఫీ తదితరులతో పాటు ముస్లిం మత పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.