ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వివిధ ప్రగతి ప్రాజెక్టులను వేగవతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు రైల్వే కనెక్టివిటీ,పిఎం ఏక్తా మాల్స్,బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి,పియం సేతు సహా ఐటిఐ ఇకోసిస్టమ్ వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఆయన ఢిల్లీ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.వివిధ ప్రగతి ప్రాజెక్టలను సకాలంలో పూర్తి చేసే విధంగా రాష్ట్ర పభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రధాని కోరారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎర్రుపాలెం-అమరావతి-నంబరు రైల్వే లైనుకు సంబంధించిన ప్రగతని సమీక్షిస్తూ ఈరైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వర్వితగతిన పూర్తి చేసి రైల్వేకు అప్పగించాలని సిఎస్ సాయి ప్రసాద్ ను ఆదేశించారు.అదే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సిఎస్ ను ఆదేశించారు.తదుపరి విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న పియం ఏక్తామాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడి సమీక్షించారు.
ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఎర్రుపాలె-అమరావతి-నంబూరు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నవంబరు,డిశంబరు మాసాల్లో పూర్తి స్థాయిలో భూసేకరణ పూర్తి చేసి అప్పగించడం జరుగుతుందని ప్రధానికి వివరించారు.అనంతరం నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్కు,విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఏక్తామాల్ కు సంబంధించిన ప్రగతిని ప్రధానికి వివరించారు.
ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా,ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు,కార్యదర్శులు కోన శశిధర్,డా.ఎన్.యువరాజ్,ఎపిఐఐసి ఎండి దినేష్ కుమార్,సిఆర్డిఏ అదనపు కమీషనర్ భార్గవ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.