తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలోనే సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పోలీసుల సహాయంతో తల్లిదండ్రులకు అప్పగించారు. భవానిపురం, క్రాంబే రోడ్డులో సోమవారం సాయంత్రం బాలుడు (4) ని గమనించిన సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రత్తిపాటి శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకొని పోలీసులతో మాట్లాడారు. సుజనా మిత్రాలు అన్ని వాట్స్అప్ గ్రూపుల్లో మెసేజ్ ను చేరవేశారు. వాట్సప్ ద్వారా విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు , భవానిపురం పోలీసులకు మరియు సుజనా మిత్రా కోఆర్డినేటర్లకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.