Breaking News

ఒక వారం కలెక్టరేట్ లో, మరో వారం నియోజకవర్గ స్థాయిలో స్పందన

-ఈరోజు స్పందనలో 160 ఫిర్యాదులు అందాయి..
-ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం..
-కలెక్టర్ డా. కే.మాధవీలత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం గోపాలపురం మండల కార్యాలయ సమావేశ మందిరంలో, శాసన సభ్యులు తలారి వెంకట్రావు, జిల్లా అధికారులతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి (సచివాలయం) వరకు స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతోందన్నారు. నూతన జిల్లాలు ఏర్పడడంతో జిల్లా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కావడానికి నియోజకవర్గాల వారి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. 160 ఫిర్యాదులు అందాయన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మండల, సచివాలయ పరిధిలోనే అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు, తదుపరి వారం నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తున్నా మన్నారు. ఫిర్యాదుల స్థాయిపై నిరంతర పర్యవేక్షణ వలన వెంటనే పరిష్కారం చూపడానికి క్షేత్ర స్థాయిలో స్పందన ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మాధవీలత తెలిపారు.

శాసనసభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి , అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కి వెళ్లి పరిష్కారం చూపాలని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లు తీసుకుని వచ్చారన్నారు. ప్రజా సమస్య పరిష్కార వేదికగా ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో స్పందన ను ఏర్పాటు చేసి , ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల పరిమితిని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నూతన జిల్లాలో కలెక్టర్ గా వచ్చిన డా. మాధవీలత గారు ఒక అడుగు ముందుకు వేసి మన నియోజకవర్గం లో తొలిసారిగా స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలు తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇంతకు ముందు నిడదవోలు లో స్పందన చేపట్టారన్నారు. స్పందన పిర్యాదు ల పరిష్కారాన్ని తదుపరి స్పందన లో తీసుకున్న చర్యలపై సమీక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అర్హులకు సంక్షేమ పథకాలు రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అమలు చేస్తున్నామన్నారు. సత్య సాయి త్రాగునీటి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రు.17 కోట్లను విడుదల చేసిందని, ఇందుకు ప్రజలు తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ పథకం కింద 243 హెబిటేషన్స్ లో కుటుంబాలకు శుద్ధమైన త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నియోజక వర్గంలో రూ.300 కోట్ల తో రహదారుల పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోవైద్య సేవలు పెంపొందించే విధంగా దేవరపల్లి లో 100 పడకలు, గోపాలపురం 30నుంచి 50 పడకలు పెంచేందుకు ముఖ్యమంత్రి వారి ఆమోదంకు ప్రతిపాదనలు పంపామన్నారు. నియోజక వర్గం లో ఇంకా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను అందించేందుకు 50 ఎకరాలు కొనుగోలు చేస్తామని శాసనసభ్యులు తెలిపారు.

స్పందనలో ఉద్యోగ, ఉపాధి, ఫించన్లు, గృహం మంజూరు, భూ వివాదాలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 160 మంది అర్జీదారుల నుంచి వినతులు అందాయి.

పలు స్పందన అర్జీలు :-
గోపాలపురం మండలం జగన్నదపురం గ్రామనికి చెందిన కుందేటి కుమారి తమ అర్జీలో తన భూమి 2.40 ఎకరాలు ఉందని అందులోని 40 సెంట్లులో ప్రభుత్వం గ్రామ సచివాలయాన్ని నిర్మించారు. తనకు భూమికి భూమి ఇంతవరకు ఇవ్వలేదని, భూమికి బదులు భూమిని కోరారు.

దీనిపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్దార్, ఎంపిడివో లకు ఆదేశాలు జారీ చేశారు.

గోపాలపురం గ్రామస్తులు ఎన్. బ్రహ్మానందం తన అర్జీలో తనకు గల రెండు వేరు వేరు సర్వే నెంబర్లో 6 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందని కాని రెవెన్యూ పరంగా ఇంతవరకు ఆన్ లైన్ కాలేదని, ఆన్ లైన్ చేయాలని కోరారు.

గోపాలపురం గ్రామ రైతు మంగల శ్రీరామ్ అర్జీలో తనకున్నా 3.97 ఎకరాల భూమిలో ఇతరులు 20 సెంట్లు ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని న్యాయం చెయ్యాలని కోరారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి, ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారి డి.బాలశంకర రావు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ పీఎస్ విజయకుమార్, జెడి మత్స్యాశాఖ ఈ.కృష్ణారావు,డీఈవో అబ్రహం, డీఎస్ఓ పి.ప్రసాదరావు, డీసీఎస్ఎం కె.తులసి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు, జీఎం పరిశ్రమలు బి.వెంకటేశ్వర రావు, సివిల్ సప్లై డిఎం టి.తులసి, డిఎస్ఓ ప్రసాదరావు, డిఎహెచ్ఓ స్వర్ణలత, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *