విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లడఖ్‌లోని టుర్టుక్ సెక్టర్‌లో శుక్రవారం జరిగిన వాహన ప్రమాదంలో దాదాపు ఏడుగురు భారత సైనికుల మృతి చెందటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 19 మంది ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో థోయిసే నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై నుంచి జారిపోయి, ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ నది లోతు దాదాపు 60 అడుగుల వరకు ఉండగా. సైనికులంతా గాయపడ్డారు. 26 మంది సైనికులను పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …