Breaking News

సెంట్రల్ నియోజకవర్గంలో పారిశుధ్య మరియు డ్రెయినేజి సమస్యల పరిష్కార దిశగా చర్యలు

-సింగ్ నగర్ ప్రాంతములో పర్యటించిన శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో శాసన సభ్యులు  మల్లాది విష్ణు, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ లతో కలసి స్థానికంగా ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గడపగడపకు ప్రభుత్వం పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య మరియు డ్రెయిన్స్ పారుదల వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావటం జరిగిందని వాటిని సంబందిత అధికారులకు తెలియజేసి పరిష్కరించినప్పటికీ శాశ్వత పరిష్కార మార్గం చేపట్టవలసిన ఆవస్యకత ఉందని శాసన సభ్యులు మల్లాది విష్ణు కమిషనర్ కి వివరించారు.

వాంబే కాలనీ, రాజరాజేశ్వరీ పేట, పాయకాపురం మొదలగు ప్రాంతాలలో పర్యటించిన సందర్భంలో పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల విధానము పరిశీలిస్తూ, ప్రదానంగా పలు డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా లేకపోవుట మరియు ఎల్ అండ్ టి వారిచే చేపట్టిన డ్రెయిన్లు అసంపూర్తిగా ఉండుట కారణంగా సమస్య కలుగుతున్న దృష్ట్యా అవసరమైనచో అదనపు సిబ్బంది ఏర్పాటు చేసి మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. అదే విధంగా స్థానిక ప్రజలు తమకు ఎదురౌతున్న సమస్యలను వార్డ్ వాలెంటరీ లేదా శానిటేషన్ సెక్రెటరీ దృష్టికి తీసుకువచ్చిన యెడల వాటిని సంబందిత అధికారులకు వివరించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.

పర్యటనలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజా తో పాటుగా కార్పొరేటర్లు యర్రగొర్ల తిరుపతిమ్మ, ఆలంపూరు విజయలక్ష్మి, ఇసరపు దేవి మరియు నగరపాలక సంస్థ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *