Breaking News

పర్యావరణాన్ని తగ్గించి గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దుదాం

-బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పెయింట్ యువర్ సిటీ పాల్గొనిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా బెంజి సర్కిల్ నందు విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో నిర్వహించి పెయింట్ యువర్ సిటీ కార్యక్రమములో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి సిద్దార్ధ మహిళా కళాశాల విద్యార్ధులతో కలసి పెయింటింగ్ వేసినారు. నగర సుందరీకరణకై బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పిల్లర్లపై విద్యార్ధులు స్వచ్ఛదంగా పాల్గొని ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయగా వారితో పాటుగా మేయర్ కూడా విధ్యార్ధులతో కలసి పెయింటింగ్ నిర్వహించారు. తదుపరి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి మరియు ఇతర అధికారులతో కలసి గ్రీనరి అభివృద్ధిలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణ పరిరక్షణకై నగరపాలక సంస్థ అనేక చర్యలు చేపట్టి నగర పరిసరాలు అన్నియు సుందరంగా పచ్చదనముతో నిండేలా గ్రీనరి పెంపుదల మరియు గోడలకు సుందరంగా ప్రజలను ఆకర్షించే విధంగా పెయింట్ నిర్వహించుట జరిగిందని, మన నగరం ఇటివలే పర్యావరణ రక్షించుటలో చేపట్టిన చర్యలలో 4 ర్యాంక్ సాదించుట జరిగిందని రాబోవు రోజులలో ఇంకను మెరుగైన ర్యాంక్ సాదించే దిశగా ప్రజలు సహకరించి కాలుష్యన్ని నివారించి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించాలని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం & ప్రపంచ సైక్లింగ్ దినోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో రేపు అనగా ఆదివారం ఉదయం సైక్లోథాన్ • వాకథాన్ • మహిళల సైక్లోథాన్, వ్యాస రచన, డ్రాయింగ్ (12 సంవత్సరాల లోపు వయస్సు గలవారికి), ఫోటోగ్రఫీ, పెయింట్ యువర్ సిటీ, జింగిల్స్/ స్లోగన్‌లు, షార్ట్ మూవీస్ మొదలగు పోటీలు ఏర్పాటు చేసినట్లు యాప్ నందు ప్రజలు వారి పేర్లను నమోదు చేసుకొనే విధంగా పేస్ బుక్, ఇన్స్ట గ్రామ నందు పోస్ట్ చేయుట మరియు పేపర్ ద్వారా ప్రకటనలు ఇవ్వటం జరిగిందని తెలియజేస్తూ, ఆశక్తి కలిగిన వారు కార్యక్రమములో పాల్గొని విజయవంతము చేయాలని పిలువునిచ్చారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *