విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన వివిధ రకాలైన టీలను టీ, కాఫీ, పానీయ ప్రియులకు అందరికి అందుబాటులో
నగరవాసులకు ‘టీ టైం’ సెంటర్ యాజమాన్యం అందిస్తున్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం చుట్టుగుంట, సన్‌రైజ్ ఆసుపత్రి రోడ్డులోని ‘టీ టైం’ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్షీ మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త, అన్ని రకాల రుచులతో వివిధ రకాలైన ఫ్లావర్ల కూడిన టీతోపాటు, అన్ని రకాల చాట్ తిను బండారాలు, ఇంకా అనేక రకాల శీతలపానీయాలు, మిల్క్ షేక్స్, బిస్కెట్స్, ఐస్‌క్రీమ్స్ ఇక్కడ ఉన్నాయని తెలిపారు. సెంటర్‌ను నగరం నడిబొడ్డును మెయిన్‌రోడ్డులో అందరికీ అందుబాటు ధరలతో, మన్నికైన, క్వాలిటీతో ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ ‘టీ టైం’ దినదినాభివృద్ధి చెందుతూ నగరంలో మరిన్ని సెంటర్‌లు రావాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు వెంకట రవికాంత్, కె.శివకుమార్‌లు మాట్లాడుతూ కస్టమర్లకు అందుబాటు ధరలో క్వాలిటీ కోసం వివిధ ప్రాంతాల నుండి ఐటమ్స్, సరుకులు రేటుతో రాజీపడకుండా కొనుగోలు చేసి అందుబాటు ధరలతో క్వాలిటీకి, రుచి, శుచికి రాజీపడకుండా వివిధ రుచులలో దమ్ము టీ, కాఫీ, బాదం మిల్క్, స్నాక్స్, స్పెషల్ స్వీట్స్, శీతలపానీయాలు, మిల్క్ షేక్స్, బిస్కెట్స్, ఐస్‌క్రీమ్స్ అనేక రకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …