Breaking News

దేవిచౌక్ సెంటర్ లో పర్యావరణ మానవహారం…

-కంబాల చెరువునుంచి ఆనంకళాకేంద్రంవరకు ర్యాలీ
-హరితహారం పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ వేంటేశ్వర ఆనం కళా కేంద్రం లో రాష్ట్ర పోల్యుషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఒకే ఒక్క భూమి ..కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణం అంటే మనం … మనం అంటే పర్యావరణం అని కమిషనర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. మన కోసం మాత్రమే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అడుగులు వేయాలన్నారు. భూమి పుట్టి 470 ఏళ్ల కోట్ల సంత్సరకాలం అయిందన్నారు. ప్రస్తుతం 90 శాతం జీవ రాశులు అంతరించిపోయి , కేవలం 10 శాతం జీవరాశులు ఉన్నాయన్నారు. రాజమండ్రి లో చాలా ఆవులలో 70 శాతం ప్లాస్టిక్ వాటి శరీరంలో ఉన్నాయని, అవి క్యాన్సర్ వంటి రోగాలతో మరణించడం జరుగుతోందన్నారు. ఇష్టానుసారం ప్లాస్టిక్ వినియోగించి పారవేయడం ద్వారా మైక్రో ప్లాస్టిక్ గా మారి తిరిగి మనమే ఆహారం గా తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే భవిష్యత్తు తరాల కోసం మనకు అందుబాటులో ఉన్న వనరులను సంరక్షించడం, భవిష్యత్తు తరాలకు అందించే భాధ్యత ను తీసుకోవాలని పిలుపు నిచ్చారు. గోదావరి నది లో స్త్నానం చేస్తే పుణ్యం మాట దేవుడెరుగు రోగాలు రాకుండా ఉంటె చాలు అన్న పరిస్థితి ఉందన్నారు. ఆ పరిస్థితి నుంచి గోదావరి పరిరక్షణ కోసం పనిచేయాల్సి ఉందన్నారు. తడి పొడి చెత్త లను విడివిడిగా ఇచ్చి సహకారం అందించి సహకరించ కోరారు. పారిస్, లండన్ వంటి మహా నగరాలు క్లీన్ సిటీగా మారడానికి అక్కడి నగర పౌరులే కారణం అన్నారు. మన నగరం పరిరక్షణ మన చేతుల్లో ఉందని దినేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్న విషయాల నుంచి స్ఫూర్తి పొంది వాటిని ఆచరణ రూపంలోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

పోల్యుషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ ఎన్. అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై ఒకటి నుంచి ఒకసారి వినియోగించి పడవేసే ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలకాలని అన్నారు. పర్యావరణ కాలుష్యము నివారణకు కృషి చేయాలని కోరారు. జేఎన్ టీయూ ప్రొఫెసర్ డా. కె వి ఎస్ మురళీకృష్ణ టెర్రస్ గార్డెన్ ని ప్రోత్సహించాలి. ఎర్త్ వార్మ్స్ ను రైతు బంధువుగా , భూమిని సారవంతం చెయ్యడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఇకపై భూమిని మదర్ ఎర్త్ గా కాకుండా డాటర్ ఎర్త్ గా ప్రేమించి కాపాడుకోవాలని సూచించారు. కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వల్ల వాతావరణానికి పెనుముప్పు వాటిల్లుతొందని , మొక్కలు చెట్లు యొక్క ఉపయోగాన్ని గుర్తించు కుని వాటిని పరిరక్షించుకోవాలన్నారు. సింధూ నాగరికత తన మనుగడను కోల్పోవడానికి , కనుమరుగు అవ్వడానికి ప్రకృతి ని నిర్లక్ష్యం చేయడం కారణమని డిప్యూటీ డైరెక్టర్ (అటవీ శాఖ) ఫణి కుమార్ పేర్కొన్నారు. రీసైకిల్ చేసే వస్తువులను కొనుగోలు చేసి వాడడం, పొడి చెత్త, తడి చెత్త లను పారిశుధ్య కార్మికుల కు విడి విడిగా ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ, అటవీ శాఖ ఉద్యోగులు, ఎన్ సి సి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత కంబాల చెరువు నుంచి ఎన్ సిసి క్యాడెట్సు, అటవీ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి, దేవిచౌక్ సెంటర్ వద్ద మానవ హారంగా ఏర్పడి, దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళా కేంద్రానికి చేరుకున్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *