Breaking News

జిల్లాలో వాడ వాడలా రెడ్ క్రాస్ ఆధ్వర్యం లో మొక్కలు నాటారు

-ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 10,000 మొక్కలు నాటి సంరక్షణ కార్యక్రమాన్ని, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డా. మాధవిలత సూచనల మేరకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి లో జూన్ 5 వ తారీఖు ఆదివారం ఉదయం 8.30 గంటలకు దిశ పోలీస్ స్టేషన్ డి యస్ పి తిరుమలరావు చే మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించామని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వై మధుసూదన్ రెడ్డి తెలిపారు.

యూత్ రెడ్ క్రాస్ సభ్యులు 150 మొక్కలు నాటి సంరక్షించే భాద్యత తీసుకున్నారు. కోరుకొండ మండలంలో నర్సాపురం పంచాయతీ లో 200 మొక్కలను రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి శ్రీమతి జక్కంపూడి విజయ లక్ష్మి ఆధ్వర్యంలో నాటుట జరిగిందన్నారు. రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆదిత్య కళాశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. రాజా నగరంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో 300 మొక్కలు నాటుట జరిగింది. కడియం, వేమగిరి పంచాయతీ లో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంత రావు ఆధ్వర్యంలో 100, అనపర్తి లో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి, అది రెడ్డి గారి ఆధ్వర్యంలో 100 మొక్కలు నాటుట జరిగింది.

కొవ్వూరు మండలం లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మత్తి రమేష్, సీతానగరంలో రెడ్ క్రాస్ మండల కమిటీ సభ్యులు డాక్టర్ బాబు, సుధాకర్, రాజమండ్రి నగరంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు లంక సత్య నారాయణ ఆధ్వర్యం లో మొక్కలు నాటుట జరిగింది.
రాజమండ్రి రూరల్ మండలం రెడ్ క్రాస్ సభ్యులు యం వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో 100, యూత్ రెడ్ క్రాస్ సభ్యులు 150 మొక్కలు నాటి సంరక్షించే భాద్యత తీసుకున్నారు. జిల్లా కమిటీ సభ్యులు నరేష్ రాజు, డాక్టర్ రమణ, సాయి బాబా, వైస్ ప్రిన్సిపల్ సునీతా, యూత్ రెడ్ క్రాస్ ఇంచార్జీ డాక్టర్ రమేష్, యన్ ఎస్ ఎస్ ఇంచార్జీ పాల్గొన్నారు

ఈ కార్యక్రమం చాలా మహత్తరమైనది ఇది ఇంతటితో ఆగకుండా మన తూర్పు గోదావరి జిల్లా మొత్తం ఇదే ఉత్సాహంతో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతామని రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ శ్రీ మధుసూదన్ రెడ్డి గారు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల లో ఈరోజు వాకింగ్ ట్రాక్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ వారి లైఫ్ నంబర్ 50 మొక్కలు ఈ పర్యావరణ దినోత్సవాన్ని ఒక వేడుకలా చేయటం అభినందనీయమని తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *