Breaking News

అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న సర్ విజ్జీ స్విమ్మింగ్‌ పూల్

-పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుంకుంటున్న సర్ విజ్జీ స్విమ్మింగ్‌ పూల్ ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36వ డివిజన్ గాంధీనగర్ లోని సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ లతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో మూతబడిన సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ ను పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ. 1.80 కోట్ల వీఎంసీ నిధులతో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నట్లు తెలిపారు. చిల్డ్రన్స్ పూల్, డైవింగ్ పూల్, కాంపిటీషన్ పూల్ ను పూర్తిగా అభివృద్ధి పరచడంతో పాటు గ్యాలరీలను కూడా రీమోడలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు సుందరీకరణ కోసం పూల్స్ చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. జిమ్ ను కూడా ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. స్విమ్మింగ్ పూల్ పరిరక్షణకు ప్రధాన గేటు ఏర్పాటుతో పాటు ప్రహరీని అందమైన చిత్రాలతో సిద్దం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ సదుపాయాలను నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో ఇటీవల కొందరు స్విమ్మర్లు ఏకంగా పాక్ జలసంధిని ఎదురీది అంతర్జాతీయంగా జిల్లా ఖ్యాతిని పెంచారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అటువంటి స్విమ్మర్లను మరింత మందిని తయారు చేసేందుకు.. ఈ స్విమ్మింగ్ పూల్ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఈలు వెంకటేష్, రామకృష్ణ, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *