ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు

-ఈనెల 9న అమరావతిలో జరగనున్న శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు విచ్చేయాలని ఆహ్వానం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని వెంకటపాలెంలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 9న జరగనున్న విగ్రహ ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణకు విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 4 నుంచే ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని.. జూన్ 9వ తేదీ ఉదయం 7.50 నుండి 8.10 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహిస్తారని ప్రతినిధులు ఎమ్మెల్యేకి వివరించారు. కావున ఈ మహోత్సవానికి తప్పక విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానం సూపరింటెండెంట్ క్రాంతికుమార్, అసిస్టెంట్ కె.శ్రీనివాసరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *