Breaking News

వ్యవసాయాన్ని పండుగగా మార్చిన జగనన్న ప్రభుత్వం…

-జిల్లాలో 250 రైతు గ్రూపులకు రూ 24.89 కోట్లతో డా. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం: పర్యాటక శాఖా మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ అని రుజువు చేసినది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని, జిల్లాలో 250 రైతు గ్రూపులకు డా. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం ద్వారా రూ.24.89 కోట్ల విలువగల వ్యవసాయ యంత్ర పరికరాలను 8.28 కోట్ల రాయితీతో అద్దె యంత్ర సేవా కేంద్రాలకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల, క్రీడ శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు.

మంగళవారం జిల్లాలో స్థానిక ఎస్.వి.యూనివర్సిటీ స్టేడియం నందు డా. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం మెగా మేళాలో ఎం ఎల్ సి శ్రీనివాస రెడ్డి, సూళ్లూరుపేట ఎం ఎల్ ఏ సంజీవయ్య, జిల్లా కలెక్టరు కే వెంకట రమణ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ్ రెడ్డి, డీసీబీసీ చైర్మన్ రెడెమ్మ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నుండి ప్రారంభించిన డా.వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
పర్యాటక శాఖామంత్రి ఆర్ కె రోజా మాట్లాడుతూ గత పాలకుల దుస్థితిని సమూలంగా మారుస్తూ ఈరోజు రైతులందరూ కూడా వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అనే పరిస్థితి తీసుకొచ్చిన జగనన్నకి రైతులందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. స్వామినాథన్ కమిటీ వంటి వ్యవసాయ నిపుణులు రైతుల కోసం చాలా సలహాలు ఇచ్చారు. కానీ అంతకంటే గొప్పగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది మనసున్నమన జగనన్న మాత్రమే అని నేను గర్వంగా చెప్పగలననీ, అత్యంత కీలకమైనవి రైతు భరోసా కేంద్రాలు అన్నారు. జగనన్న ప్రభుత్వంలో, రాజశేఖర్ రెడ్డి  ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ అంతకు ముందు చూస్తే వ్యవసాయం అంటే వ్యయ ప్రయాసలకోర్చి చేయాల్సింది, కానీ ఈరోజు ఆ వ్యయం తగ్గింది ప్రయాశ తగ్గిందని జగన్ వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి, గిట్టుబాటు రెండిటికీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో అండగా నిలబడి వాళ్ళకి సహాయం చేస్తూ ఈ విధంగా వైయస్సార్ యంత్ర పథకం ద్వారా రైతులకు తక్కువ అద్దెతో యంత్రాలను, వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా చేసారని అన్నారు. ఈ దేశంలో రైతుల కోసం మాటలు చెప్పిన ప్రభుత్వాలని చూసారని, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల కోసం చేతల్లో రైతులకు మంచి చేసి చూపించిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అందరూ కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకు వచ్చారని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో 3800 ఆర్ బి కే స్థాయి యంత్ర సేవ కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను, 320 క్లస్టర్ స్థాయి CHC లకు 320 కంబైండ్ హార్వేస్టర్ల పంపిణీ జరిగింది అన్నారు. వీటికోసం 5260 రైతు గ్రూప్స్ బ్యాంకు ఖాతాలకు దాదాపు 175 కోట్ల సబ్సిడీ CM గారు జమ చేసారన్నారు. ఆయనకి మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తున్నానన్నారు. విత్తు నుండి కోత దాక వ్యవసాయ పరికరాలను యంత్రాలను తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచి ఎక్కువ ఆదాయం వచ్చే లాగా ఈ బృహత్తర పథకాన్ని తెచ్చిన జగన్ నిజంగా ఆయన చిన్న వయసు అయినా, మొదటి సారి ముఖ్యమంత్రి ఐన ఎంత చక్కగా రైతుల గురించి ఆలోచించి ఆయన చేస్తున్న కార్యక్రమం చూస్తుంటే తండ్రిని మించిన తనయుడులా రైతు బాంధవుడుగా ఉన్నారని అన్నారు. ఈ రోజు ఇలాంటి అద్భుతమైన పథకాలతో అన్ని వర్గాల వారిని ఆశీర్వదిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆశ్చర్యపరుస్తూ మన రాష్ట్ర పథకాలను ఆదర్శంగా తీసుకునే విధంగా పాలన సాగించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన పాదయాత్రలో గ్రామాలకు వెళ్లినప్పుడు విద్యార్థులు మహిళలు అందరితో కూడా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క జిల్లాలో ఏ విధమైన కష్టాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని దూరం చేయడానికి ఏం చేయాలి అనేది ఆయన ప్లాన్ చేసుకొని తన డైరీలో ప్రతి అంశం రాసుకున్నారు కాబట్టే ఈరోజు రైతులకు వ్యవసాయం అంటే పండగగా మార్చారన్నారు.

ఎం.ఎల్.సి. శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ రైతన్నను దేశానికి వెన్నెముక గా భావించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని దృడ సంకల్పంతో ముఖ్యమంత్రి ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వంటివి 40% రాయితీతో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
సూళ్ళురుపేట ఎం ఎల్ ఏ సంజీవయ్య మాట్లాడుతూ రైతే రాజు, రైతులను ఆదుకోవాలని, రైతన్నకు వ్యవసాయం పండుగలా ఉండాలని, రైతును ఉన్నతంగా, ఆనందంగా చూడాలనే ఉద్దేశంతో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా పలు పథకాలు తెచ్చారని ఆయనని ఎల్లప్పుడూ ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా గుర్తు చేసారు.

జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనన్ని ప్రజా సంక్షేమ పథకాలు జగనన్న ప్రభత్వం విద్యాదీవేన, అమ్మఒడి ఇలా పలు పథకాలు అమలు చేస్తున్నారని, వై ఎస్ ఆర్ యంత్ర సేవ పథకంలో లబ్దిదారులు వాట 10 శాతం, ప్రభుత్వ సబ్సిడీ 40 శాతం ఇస్తోందని, బ్యాంకు రుణం 50 శాతం గా ఉంటుందని తెలిపారు .
జిల్లా కలెక్టర్ ప్రారంభోపన్యాసం లో మాట్లాడుతూ ప్రభుత్వం యంత్ర సేవ పథకం 2021-22 సం.లోనే ప్రారంభించిందని, గతంలో 165 గ్రూపులకు రూ. 3.30 కోట్ల మన జిల్లాలో అందించడం జరిగిందనీ, ఇప్పుడు ఈ మెగా మేళాలో ఇంత పెద్ద ఎత్తున ట్రాక్టర్లు హర్వెస్టర్ లు అందించడం చాలా గొప్ప విషయం అని రైతులకు ఖర్చు తగ్గించి ఎక్కువ దిగుబడి అందేలా చేయడమే ఈ పథకం లక్ష్యమని అన్నారు.
సమావేశ అనంతరం మంత్రి రోజా చేతుల మీదుగా రైతు గ్రూపులకు రూ 8.28 కోట్ల సబ్సిడీ మెగా చెక్ ను అందింఛి జిల్లాలోని CHC లకు 180 ట్రాక్టర్ లు, 13 వరి కోత యంత్రాలు, 57 వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రైతు సంఘాల గ్రూపులకు అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి RDO కనక నరసారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి దొరసాని, వ్యవసాయ అధికారులు, పెద్ద ఎత్తున రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *