విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలలో వస్తున్న స్పందన,మద్దతు చూస్తుంటే వారి నాయకత్వం లో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ లో వెలగపూడి సుబ్బారావు వీధి నందు దాదాపు 20లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీ.సి.రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ 15వ డివిజన్ లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్ల కాలంలో 5 రోడ్లు, వాటర్ పైప్ లైన్ కొరకు దాదాపు 3కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా వున్నప్పుడు తప్ప గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే కు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న స్పందించలేదని,ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లో 70 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో స్మశాన వాటికను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లా రావు, AE రాజేశ్వరరావు, వర్క్ ఇన్స్పెక్టర్ శివ,వెలగపూడి సుబ్బారావు,మల్లేశ్వర రావు, కొల్లిపర శ్రీను,ఈశ్వరరావు,వెంకయ్య నాయుడు,ఆకుల బాలాజీ,మధు,చిన్న,ఆదినారాయణ,సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …