విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ స్టడీ సర్కిల్లో కోచింగ్ నిమిత్తం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ను విజయవంతంగా నిర్వహించామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి. విజయ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని ఏపీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్, బ్యాంక్ పిఓ ఆఫీసర్స్ పరీక్షలకు శిక్షణకు అర్హత పొందేందుకు ఆదివారం నగరంలోని కె బి ఎన్ డిగ్రీ కళాశాల, ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్ లైన్ ప్రవేశ పరీక్షను నిర్వహించటం జరిగిందన్నారు. మొత్తం 352 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 200 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. కేబీఎన్ కళాశాలలో 176 మంది అభ్యర్థులకు గాను 93 మంది, ఆంధ్ర లయలా ఇంజనీరింగ్ కళాశాలలో 176 మంది అభ్యర్థులకు గాను 107 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …