రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు వైద్యరంగంలో ఎన్నో విన్నూత్న మార్పులు సంభవిస్తున్నాయని వైద్య రంగంలో సరిక్రొత్త విప్లవాత్మకమైన మార్పులతో ఆధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి చేరువయ్యాయని ఆదివారంనాడు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ లో జరిగిన వైద్యుల సదస్సులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమండ్రి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్, తూర్పు గోదావరి జిల్లా విభాగం ఫెడరేషన్ ఆఫ్ అబ్స్త్రిసియన్ అండ్ గైనకాలజీ సొసైటీ మరియు అను మై బేబి Hospital సంయుక్తం గా నిర్వహించిన సి.ఎం.ఈ సదస్సులో పలువురు డాక్టర్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అను హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ డా. రమేష్ గాజుల ప్రసంగిస్తూ నేడు వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయని వాటి పరిజ్ఞానంతో అందరికీ ఆధునిక వైద్యం అందించడం సులువైందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నూతన వైద్య విధానంపై అనేక సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నూతన వైద్య విధానంలో రోగులకు ఆధునిక చికిత్సలు అందించేందుకు ఇటువంటి సదస్సులు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. పిడియాట్రిక్ కార్డియాలజి, నియోనేటల్, గైనకాలజి, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, గస్ట్రో ల లో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని అవి ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డా. ఎస్. కిరణ్ కుమార్, డా. వి. విశ్వేశ్వరరావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డా. ఆర్.ఎస్. చలం మరియు డా. సతీష్ యం. ఎస్ మరియు డా. ఆర్. రామకృష్ణ గారు మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో ఇటీవల జరుగుతున్న అప్డేట్స్ వివరించారు. గౌరవ అతిథులుగా డా. వై.ఎస్. గురుప్రసాద్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజమండ్రి ఇండియన్ అకాడమీ పిడియాట్రిక్స్ తూర్పు గోదావరి జిల్లా విభాగపు అధ్యక్షులు డా. ఆకుల. సత్యనారాయణ, ఫెడరేషన్ ఆఫ్ అబ్స్త్రిస్త్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డా. టి.పద్మజ గారు గైనకాలజి, నూతన శిశువుల వైద్యంలో ఆధునిక వైద్య సేవల గురించి వివరించారు. సైంటిఫిక్ కమిటీ సభ్యులుగా డా. కె.వి. రవికుమార్, డా. గురుప్రసాద్ పేరూరి, డా. మాధురి నల్లమోతు, డా. రాజా అశోక్ కోగంటి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డయాబెటిస్ వలన వచ్చే సమస్యలు గురించి చర్చించారు. హైపర్ టెన్షన్ వలన ప్రెగ్నెన్సీ సమయంలో సంభవించే పరిణామాలు, పార్కిన్సన్స్ వ్యాధులపై, న్యూరాలజీ మరియు హఠాత్తుగా వచ్చే గుండె నొప్పి నివారణోపాయాలు తదితర అంశాలపై ప్రసంగించారు.
Tags rajamendri
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …