అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
1998 డీఎస్సీ అభ్యర్ధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అభ్యర్ధులు 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు సీఎంని సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు.
Tags amaravathi
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …