ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 3,156 మంది అభ్యర్థులు చెల్లుబాటైన నామినేషన్లు

-73 సర్పంచ్ స్థానాలకు 435 మంది అభ్యర్థులు అర్హత
-856 వార్డు సభ్యుల స్థానాలకు 2,721 మంది అభ్యర్థులు చెల్లుబాటు
-ఐదు మండలాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి
-ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ వెల్లడించారు.

జిల్లాలోని విజయవాడ, తిరువూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఐదు మండలాల్లో 73 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 856 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం మొత్తం 435 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, 2,721 మంది వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.