-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-గొడ్డలి పార్టీ నాయకుడికి కావాల్సిందల్లా డబ్బు, అధికారమే
-సీఎం చంద్రబాబుకు కుమార్తె పెళ్లి పత్రిక షర్మిల ఇవ్వడం తప్పా..?
-మహిళలను కించపరిచేలా నీలి మీడియాలో కథనాలు
-జర్నలిజాన్ని భ్రష్టుపట్టిస్తున్న నీలి మీడియా
-తల్లిని తిట్టిన వారే నేడు జగన్ వెంట ఉన్నారు
-అసెంబ్లీ సాక్షిగా భువనమ్మను అవమానించిన గొడ్డలి పార్టీ
-పైశాచిక ఆనందాన్ని పొందిన జగన్ : మంత్రి సవిత
పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త:
జగన్ రెడ్డికి అధికారం, డబ్బే తప్ప మానవీయ విలువలు, సంబంధాలు ఒంటబట్టవని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విరుచుకుపడ్డారు. తన నీలి మీడియాలో రాసి వార్తతో తోడబుట్టిన చెల్లెలు షర్మిలను మాత్రమే కాకుండా యావత్తు రాష్ట్ర మహిళలనే కించపరిచారని, జర్నలిజం విలువలను ఆయన మీడియా దిగజార్చుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు.తండ్రి సమానులైన సీఎం చంద్రబాబును కలిసి వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వానపత్రికను ఇవ్వడంపై తప్పుబడుతూ జగన్ మీడియా రాసిన కథనంపై మండిపడ్డారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వార్త ప్రచురించారన్నారు. కేవలం షర్మిలను మాత్రమే కాకుండా రాష్ట్ర మహిళలను కించపరిచారన్నారు. జగన్ కు తెలిసే వార్త ప్రచురించారన్నారు. మహిళలపై జగన్ కు ఎప్పుడూ సదాభిప్రాయం లేదన్నారు. గతంలో వైఎస్ విజయమ్మను విమర్శించారన వారే నేడు జగన్ చుట్టూ ఉన్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరిని దూషించినప్పుడు జగన్ పైశాచిక ఆనందం పొందారన్నారు. జగన్ కు డబ్బు, అధికారం తప్ప మరేమీ పట్టదన్నారు. మానవీయ విలువలు, రక్త సంబంధాలు ఆయన వంటబట్టవన్నారు. బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ లో సొంత మేన కోడలి పెళ్లి జరగకుండా జగన్ అడ్డుకున్నారని, ఇదీ ఆయన నైజమని మంత్రి సవిత మండిపడ్డారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జగన్ కు మహిళలే గట్టి బుద్ధి చెప్పారన్నారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ గొడ్డలి పార్టీకి మహిళలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమని మంత్రి సవిత స్పష్టంచేశారు.
జరల్నిజం విలువలు దిగజార్చిన నీలి మీడియా
ఎంతో ఉన్నత విలువలు, ఆశయాలు కలిగిన రంగం మీడియా రంగమని మంత్రి సవిత కొనియాడారు. అటువంటి రంగాన్ని భ్రష్టుపట్టించేలా నీలి మీడియా వార్తలు ప్రచురిస్తోందన్నారు. ఇటీవలే జర్నలిజం గొప్పతనాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారన్నారు. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలు పాటిస్తూ, దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారన్నారు. కాని, అందుకు విరుద్ధంగా నీలి మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, అబద్ధానికి మారుపేరుగా నిలిచిందని విమర్శించారు. బాబాయ్ ను చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. జగన్ కన్నుసన్నల్లో, భారతి నేతృత్వంలో నడుస్తున్న నీలి మీడియాలో సొంత చెల్లెలపై తప్పుడు వార్త ప్రచురించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆ మీడియా రిపోర్టుర్లు ఆలోచించాలని, మహిళలను తప్పుడు కథనాలు రాయడం మానుకోవాలని మంత్రి సవిత హితవు పలికారు.
