-అమరావతి అభివృద్ధికి 20.092 ఎకరాల భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు భూముల సమీకరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాడికొండ, మోతడక గ్రామాలకు చెందిన పలువురు రైతులు మొత్తం 20.092 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ కింద అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు గురువారం (2026 నవంబర్ 19) రైతులు సంబంధిత కాంపిటెంట్ అధికారులకు భూములకు సంబంధించిన అంగీకార పత్రాలను అందజేశారు.
రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు అంగీకరించడంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR)తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మోతడకలో 4.722 ఎకరాల భూముల సమీకరణ
మోతడక గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు 4.722 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు అంగీకార పత్రాలను కాంపిటెంట్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. కృష్ణారావుకు అందజేశారు.
భూములు అందజేసిన రైతుల వివరాలు:
ఉప్పుటూరి అమల – 0.980 ఎకరాలు
బత్తిన ప్రియాంక – 0.500 ఎకరాలు
కొజ్జా సాంబశివరావు – 0.390 ఎకరాలు
సూర్యదేవర విజయ – 0.750 ఎకరాలు
నూతలపాటి సాయి తరుణ్ – 2.102 ఎకరాలు
తాడికొండలో 15.37 ఎకరాల భూములు
తాడికొండ గ్రామానికి చెందిన రైతులు 15.37 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు కాంపిటెంట్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. గణపతిరావుకు అంగీకార పత్రాలను అందజేశారు.
భూములు అందజేసిన రైతుల వివరాలు:
కాకుల్ల మురళీకృష్ణ – 7.060 ఎకరాలు
పొదలకూరు లక్ష్మి – 4.410 ఎకరాలు
పులికొండ యామిని – 3.010 ఎకరాలు
కంతేటి నాగేశ్వరరావు – 0.890 ఎకరాలు
అమరావతి రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రైతులు ముందుకొచ్చి భూములు సమర్పించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. రైతుల సహకారంతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.
