59వ జాతీయ గ్రంథాలయ మహోత్సవ పోటీలలో సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులకు బహుమతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
59వ జాతీయ గ్రంథాలయ మహోత్సవాల సందర్భంగా విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో జరిగిన వక్తృత్వ పోటీలలో తమ సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు బహుమతులు సాధించారని ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఆంగ్ల వక్తృత్వ పోటీలో “సెల్ ఫోన్ ఫ్రీ వరల్డ్” అనే అంశంపై మాట్లాడి జూనియర్ ఇంటర్ సి.ఇ.సి (CEC) చదువుతున్న బి. యశ్వంత్ రెండవ బహుమతి సాధించగా, తెలుగు వక్తృత్వ పోటీలో “నేటి చదువులు” అనే అంశంపై మాట్లాడి సీనియర్ ఇంటర్ ఎం.ఇ.సి (MEC) చదువుతున్న టి. జీవన్ కుమార్ మూడవ బహుమతి సాధించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు విజేతలను అభినందించారు.