విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొనుటకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ.పాల్ ఆధ్వర్యంలో కె.ఎ.పాల్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఎ.పి, తెలంగాణ రాష్ర్టాల స్టేట్ కో ఆర్డినేటర్ సుశ్మిత స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కె.ఎ.పాల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొనుటకు నిర్వహిస్తున్న కె.ఎ.పాల్ సంకల్ప యాత్ర జూలై 9 నుండి జులై 22 వరకు పర్యటన కొనసాగుతుందని ఈ పర్యటన లో తేదీ ల వారిగా పర్యటించు ప్రాంతాలు విశాఖపట్నం , విజయగరం, శ్రీకాకుళం , కాకినాడ , రాజమండ్రి , ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం , కర్నూలు లలో ప్రజా యాత్ర నిర్వహిస్తున్నామని ఈ యాత్ర లో అందరూ ఆహ్వానితులే అని ఆమె అన్నారు. ఈసమావేశంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …