-19 అంతర్జాతీయ ఆర్డర్లు.. రూ.1.28 కోట్ల వ్యాపార ఒప్పందాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతిలో నిర్వహిస్తున్న రివర్స్ బయ్యర్స్–సెల్లర్స్ మీట్ (RBSM)లో మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలు విశేష విజయాన్ని సాధించారు. రెండో రోజు నిర్వహించిన అంతర్జాతీయ బిజినెస్ టు బిజినెస్ (B2B) సమావేశాల్లో 39 మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొనగా, వారిలో 18 మంది 19 అంతర్జాతీయ ఆర్డర్లను దక్కించుకున్నారు. ఈ ఆర్డర్ల మొత్తం విలువ రూ.1.28 కోట్లుగా నమోదైంది.
కలంకారీ, హస్తకళా ఉత్పత్తులు, ఆటోమొబైల్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు, వ్యవసాయ, ఆహార, వెదురు ఉత్పత్తులకు విదేశీ కొనుగోలుదారుల నుంచి ఆర్డర్లు లభించాయి. ముఖ్యంగా కలంకారీ, హస్తకళా ఉత్పత్తులకు రూ.50 లక్షలకు పైగా, ఆటోమొబైల్ విడిభాగాలకు రూ.23 లక్షలకు పైగా విలువైన ఆర్డర్లు రావడం విశేషం. పలువురు మహిళలు తమ ఉత్పత్తుల నమూనాలను అంతర్జాతీయ కొనుగోలుదారులకు అందజేయగా, వాటిపై తదుపరి చర్చలు జరగనున్నాయి.
మహిళా పారిశ్రామికవేత్తలు దేశీయ మార్కెట్లకే పరిమితం కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు RBSM చక్కని వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందించిన మెప్మా మిషన్ డైరెక్టర్‌కు, సహకరించిన AMD, SMC, SMM-LHలకు, మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి ప్రోత్సహించిన ప్రాజెక్ట్ డైరెక్టర్లు, జిల్లా మెప్మా బృందాలకు అభినందనలు తెలిపారు. ఆర్డర్లు సాధించిన మహిళా పారిశ్రామికవేత్తలను మెప్మా ప్రత్యేకంగా అభినందించింది.
