ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఏకగ్రీవాల వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల మొదటి విడతలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు మరియు వార్డు సభ్యుల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో విడుదల చేశారు. జిల్లాలోని పలు పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

05 సర్పంచ్ స్థానాలు వెలగలేరు, గుడవల్లి, రామరాజ్య నగర్, కునపరాజుపర్వ, నాగులూరు ఏకగ్రీవమైనాయి. 73 సర్పంచ్ స్థానాలకుగాను ఐదు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 68 స్థానాల్లో 179 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

856 వార్డు సభ్యుల స్థానాలకు 75 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 781 స్థానాలకు 1,662 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు

పూర్తి స్థాయిలో మరియు మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమైన పంచాయతీలు

* జి.కొండూరు మండలం వెలగలేరు పంచాయతీ సర్పంచ్‌గా చిరుమామిళ్ల స్వప్న కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికకాగా, 5 వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

* రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్‌గా నేర్సు వెంకటేశ్వరమ్మ తో పాటు మొత్తం 12 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

* రెడ్డిగూడెం మండలం కునపరాజుపర్వ పంచాయతీ సర్పంచ్‌గా పొనగంటి రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికవగా, మొత్తం 12 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

* విజయవాడ రూరల్ మండలం గుడవల్లి సర్పంచ్‌గా ఎన్.నీలమణేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవగా, 11 వార్డులకు గాను 10 వార్డులు (1 నుండి 10 వరకు) ఏకగ్రీవమయ్యాయి.

* విజయవాడ రూరల్ మండలం రామరాజ్య నగర్ సర్పంచ్‌గా కొండా వెంకట రమణ మరియు 6వ వార్డు సభ్యురాలిగా కృష్ణవరపు సావిత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మండలాల వారీగా ఏకగ్రీవమైన వార్డు సభ్యుల వివరాలు

1.జి.కొండూరు మండలం
గుర్రాజుపాలెం .. వేముల భూలక్ష్మి (వార్డు 7), కోడూరు పాకలపాటి రజని (వార్డు 11), తెల్లదేవరపాడు చిలక సుధాకర్ (వార్డు 3), గంగుల లావణ్య (వార్డు 4), జెర్రిపోతుల సురేష్ (వార్డు 5), అఖిల లింగాల (వార్డు 7), వెలగలేరు రాజవరపు రూప శ్రీ పద్మావతి (వార్డు 8), బొడ్డు శ్యామల రావు (వార్డు 13), మెండెం నాగమణి (వార్డు 14)

2.ఇబ్రహీంపట్నం మండలం
దాములూరు యర్రగుంట్ల శివాజీ (వార్డు 1), ప్రతిపాటి ద్రౌపతి (వార్డు 2), చిలుకూరు మొగులూరి పిచ్చమ్మ (వార్డు 5).

3.మైలవరం మండలం
మైలవరం శ్రీరామ్ నాగరాజు (వార్డు 9), ఎం.సరళ (వార్డు 10), జి.లక్ష్మి (వార్డు 15), కె.రమాదేవి (వార్డు 16), ఎం.సునీత (వార్డు 17), ఎం.శివదుర్గ (వార్డు 18), జి.శ్రీలేఖ (వార్డు 19).

4.విజయవాడ రూరల్ మండలం
ఎనికేపాడు నరబోయిన ధనలక్ష్మి (వార్డు 2), కిలారు లిఖిత రాణి (వార్డు 4), కొడాలి వెంకట సుబ్బారావు (వార్డు 14), షేక్ నసీమా (వార్డు 16), గుడవల్లి కిరపు కృష్ణ కుమారి (వార్డు 1), జొన్నలగడ్డ శ్రీ లక్ష్మీ పార్వతి (వార్డు 2), జుజ్జవరపు శ్రీనివాసరావు (వార్డు 3), జీతం శ్రీకాంత్ (వార్డు 4), ఇటికల జ్యోతి (వార్డు 5), జుజ్జవరపు సునీత (వార్డు 6), కొల్లిపర సుబ్బలక్ష్మి (వార్డు 7), జొన్నలగడ్డ ప్రకాష్ రావు (వార్డు 8), లోయ శ్రీనివాసరావు (వార్డు 9), తేల నాగదుర్గ (వార్డు 10) జక్కంపూడి సొంగా పవన్ కుమార్ (వార్డు 11), ప్రసాదంపాడు నూతి భవాని (వార్డు 4), శ్రీ విద్య పాటిబండ్ల (వార్డు 5), గుడవల్లి రవీంద్ర బాబు (వార్డు 6), గూడపాటి శివదుర్గ (వార్డు 8), సేతికం సుధారాణి (వార్డు 9), బొడ్డు మణి (వార్డు 11), తోట భాను ప్రకాష్ (వార్డు 15), కొలకులూరి ఏసుపాదం (వార్డు 16), రామరాజ్య నగర్ కృష్ణవరపు సావిత్రి (వార్డు 6), రామవరప్పాడు కరుమూరి మణిమ్మ (వార్డు 9).

5.రెడ్డిగూడెం మండలం
కునపరాజుపర్వ చన్నెల్ల ముతారావు (వార్డు 1), చామకూర రత్నకుమారి (వార్డు 2), గుత్తి శిరీష (వార్డు 3), తోటకూర నాగమణి (వార్డు 4), రాయుడు కృష్ణారావు (వార్డు 5), ఆకుల శివపార్వతి (వార్డు 6), తల్లూరి నాగమల్లేశ్వరి (వార్డు 7), గురిజాల సురేష్ బాబు (వార్డు 10), పైటపాల జ్యోతి (వార్డు 11), గొల్లమండల కళ్యాణి (వార్డు 12), బత్తుల భూలక్ష్మి (వార్డు 13), వేముల కొండయ్య (వార్డు 14), ముచ్చినపల్లి దేవళ్ళ ఆంజనేయులు (వార్డు 1), బెల్లంకొండ రాజసులోచన (వార్డు 5), మట్టా సుశీల (వార్డు 7), నాగులూరు సయినా రత్నమాల (వార్డు 1), శ్రీనివాసరావు సింగళ్ళ (వార్డు 2), వెంకట ఉషారాణి పిన్నిబోయిన (వార్డు 3), నాగజ్యోతి బెజవాడ (వార్డు 4), నేరుసు వెంకటేశ్వరరావు (వార్డు 5), తన్నీరు ముసలయ్య (వార్డు 6), ఉత్పల శ్రీనివాసరావు (వార్డు 7), మట్టకొయ్య రాజేష్ (వార్డు 8), నందిపాము విజయ కుమారి (వార్డు 9), వీర్ల తిరపతమ్మ (వార్డు 10), చందన భూక్యా (వార్డు 11), భూక్యా అరుణ్ కుమార్ (వార్డు 12), నరుకుళ్ళపాడు పల్లపు సుబ్బాయమ్మ (వార్డు 4), గుంజి ఉమాదేవి (వార్డు 6), రుద్రవరం భీమిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి (వార్డు 3), యెరువ వేణుగోపాల్ రెడ్డి (వార్డు 5).

మిగిలిన స్థానాల్లో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన తెలిపారు.