హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మధురానగర్ బి బ్లాక్లో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు, నిర్వాహకులు ఎమ్మెల్యే కి ఆత్మీయ స్వాగతం పలికారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహా పడిపూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
