-మేయర్ వంగవీటి రాధాను ఘనంగా సత్కరించిన ఎంపీ కేశినేని చిన్ని, సతీమణి జానకి లక్ష్మి
-కూటమి ప్రజాప్రతినిధుల ఐక్యత, విజయోత్సాహం, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచిన వేడుక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో, నూతనంగా ఎన్నికైన మేయర్ వంగవీటి రాధా, కూటమి కార్పొరేటర్లను అభినందిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ఘనమైన ఆత్మీయ అభినందన విందు కార్యక్రమాన్ని ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన మేయర్ వంగవీటి రాధాను ఎంపీ కేశినేని చిన్ని, ఆయన సతీమణి జానకి లక్ష్మి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన కూటమి కార్పొరేటర్లందరినీ ఒక్కొక్కరిగా శాలువా, మనీ ప్లాంట్, అమ్మవారి చిత్రపటంతో సత్కరించి వారి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఆత్మీయ అభినందన విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధా వెంకన్న, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి ముఖ్య నాయకులు, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. అతిథుల అభిరుచులకు అనుగుణంగా రుచికరమైన, నాణ్యమైన పలు రకాల వంటకాలతో ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కటి ఆతిథ్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ విందు కార్యక్రమం నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య ఆత్మీయతను మరింత పెంపొందించింది.
అనంతరం మేయర్ వంగవీటి రాధా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు, కార్పొరేటర్లు అందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకే వేదికపై కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులంతా కలిసికట్టుగా పాల్గొని సంబరాలు చేసుకోవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎన్నికల విజయంతో ప్రారంభమైన ఈ ఆత్మీయ సమ్మేళనం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న ఐక్యత, పరస్పర గౌరవం, సమన్వయానికి అద్దం పట్టింది. రాజకీయాలకు అతీతంగా పరస్పర ఆత్మీయతను చాటుకుంటూ, విజయవాడ నగర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే స్ఫూర్తిని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
విజయవాడ నగర ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేయర్, కార్పొరేటర్లు, కూటమి నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలనే సంకల్పానికి ఈ ఆత్మీయ అభినందన విందు వేదికగా నిలిచింది.
కూటమి ఐక్యత ఏమిటో, నాయకుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం ఎంత బలంగా ఉందో చాటిచెప్పేలా, సత్కారాలు, విజయోత్సవాలు, రుచికరమైన విందు భోజనాలతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
