అమరావతి అభివృద్ధికి భూసేకరణలో ముందడుగు.. తాడికొండ, కంతేరు, వడ్డమానులో ముమ్మరంగా ల్యాండ్ పూలింగ్!

-9.10 ఎకరాల భూమిని పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆరుగురు రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం ఏపీ సీఆర్డీఏ (APCRDA) ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కంతేరు, తాడికొండ, వడ్డమాను గ్రామాలకు చెందిన ఆరుగురు రైతులు మొత్తం 9.10 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందజేసేందుకు ముందుకొచ్చారు.
ఈ మేరకు రైతులు మంగళవారం (2026 నవంబర్ 24) సంబంధిత కాంపిటెంట్ అధికారులకు తమ అంగీకార పత్రాలను అందజేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడంతో అమరావతి రైల్వే లైన్‌తో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల పనులకు మరింత మార్గం సుగమం కానుంది.
కంతేరులో 5.16 ఎకరాలు
కంతేరు గ్రామంలో ముగ్గురు రైతులు 5.16 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు కాంపిటెంట్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. సాయి శ్రీనివాస నాయక్‌కు అంగీకార పత్రాలు అందజేశారు.
భూములు అందజేసిన రైతుల వివరాలు:
వేమూరి సాత్విక – 0.945 ఎకరాలు
గరివిబోయిన హేమ – 0.98 ఎకరాలు
గరివిబోయిన వెంకటేశ్వర్లు – 3.24 ఎకరాలు
తాడికొండలో 2.35 ఎకరాలు
తాడికొండ గ్రామంలో ఒక రైతు 2.35 ఎకరాల భూమిని పూలింగ్ కింద ఇచ్చేందుకు కాంపిటెంట్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. గణపతిరావుకు అంగీకార పత్రాన్ని అందజేశారు.
రైతు వివరాలు:
మందడపు హైమావతి – 2.35 ఎకరాలు
వడ్డమానులో 1.59 ఎకరాలు
వడ్డమాను గ్రామంలో ఇద్దరు రైతులు మొత్తం 1.59 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు కాంపిటెంట్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. విజయలక్ష్మికి అంగీకార పత్రాలను అందజేశారు.
భూములు అందజేసిన రైతుల వివరాలు:
తిన్నవల్లి లక్ష్మీనారాయణ – 1.09 ఎకరాలు
నాలాది ఎల్. ప్రియదర్శిని – 0.50 ఎకరా
అమరావతి రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు అందజేస్తుండటం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు మరింత ఊపునిస్తోంది.