ఘనంగా బొమ్మసాని సుబ్బారావు 62వ పుట్టినరోజు వేడుకలు

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
గొల్లపూడి గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు 62వ పుట్టినరోజు వేడుకలు సోమవారం గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు, స్థానిక పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బొమ్మసాని సుబ్బారావును దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. భారీ కేక్‌లను ఆయనతో కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి బొమ్మసాని కృష్ణమూర్తి కాలం నుంచి ఇప్పటి వరకు గత రెండు తరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న గొల్లపూడి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. అలాగే గొల్లపూడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు, మూడో తరం వారసుడు బొమ్మసాని జయంత్ సాయిని కూడా గెలిపించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు. గొల్లపూడి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలుస్తానని తెలిపారు. పుట్టిన రోజు వేడుకలు తన తండ్రిగారితో కలసి నిర్వహించుకున్నందుకు ఆనందంగా వుందన్నారు. అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.